గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామంలోని ఎంపీ యుపి స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను గురువారం మాజీ సర్పంచ్ ఎస్ఏ రఫిక్, విద్యా కమిటీ చైర్మన్ రాజశేఖర్ పంపిణీ చేశారు. కిట్లు, పుస్తకాలు, బ్యాగులు విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.