సుగాలిమెట్ట: బైక్‌ను ఢీకొన్న కారు: యువకుడికి తీవ్రగాయాలు

64చూసినవారు
పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామ సమీపంలోని ఎస్ఆర్బిసి కాలువ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుగాలిమెట్టకు చెందిన బాలు నాయక్‌ అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ప్రమాదంలో బాలు నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్