ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంటే అధికారులకు అలుసుగా మారిందని శనివారం పాణ్యం మండలం సుగాలిమెట్టలో ఏపీ మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షానికి అస్తవ్యస్తంగా మారి పాఠశాల వెళ్లేందుకు దారి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆధికారులు స్పందించి, త్వరితగతంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.