కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రూ. 678. 50 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. రూ. 141 లక్షలతో కర్నూలు-అనుగొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు తారురోడ్డును బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల వల్ల ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు.