దేశంలో 13 కేంద్రాలు గుర్తిస్తే అందులో ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రం ఉండడం గర్వించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. బుధవారం కల్లూరు మండలం తడకనపల్లెలో ఎంపీ మాట్లాడారు. రానున్న రోజులలో ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృధి పనులు ఏమి జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు.