మండల వ్యాప్తంగా రెపరెపలాడిన జాతీయ జెండా

59చూసినవారు
మండల వ్యాప్తంగా రెపరెపలాడిన జాతీయ జెండా
గడివేముల మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం నాడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ బి వి యన్ విద్యాసాగర్ , మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల ప్రత్యేక అధికారి అల్లంరాజు శ్రీనివాసరావు, జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి , మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి విమల వసుంధర దేవి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ సుబ్బరాయుడు , సచివాలయంలో టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ల చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేశారు.

సంబంధిత పోస్ట్