మండల కేంద్రం గడివేముల లో వెలసిన శ్రీ మత్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి శుక్రవారం రోజు సకల శుభాల ఆశీస్సులు కలగాలని శ్రావణమాస చీర సారె కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని 11 రకాల పిండి వంటలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి శ్రావణ సౌభాగ్యాన్ని పొందారు. ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు.