పాణ్యం మండల కేంద్రంలో పశు వైద్యశాలలో ఆదివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏడీ కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1885లో లూఈ ప్యాక్షర్ ద్వారా కనుగొన్న యాంటీ రాబిస్ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతపై మాట్లాడారు. జంతువుల నుంచి వచ్చే 150 వ్యాధులపై ప్రజలను అవగాహన కల్పించారు. సౌమ్య, పూజిత, ఉప్పెంద్ర, గోపాలమిత్ర తదితరులు పాల్గొన్నారు.