పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం పెండేకల్లులో ఒక రైతుకు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. శనివారం 15 క్యారెట్ల వజ్రం ఒక రైతుకు దొరికింది. మొదట బేరం కుదరకపోయినా, గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి రూ. 6. 80 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి ఈ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతు అందుకున్న విలువైన రకం వజ్రాన్ని విక్రయించి మంచి లాభం పొందినట్లు తెలిసింది.