వెల్దుర్తి మండలం చెరకలపాడు సచివాలయం పరిధిలోని కొసనపల్లెలో శుక్రవారం కిషోరి వికాస బాలికల కోసం వేసవి శిబిరం నిర్వహించారు. సీడీపీవో లుక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు రక్తహీనత, పరిశుభ్రత, బాల్యవివాహాల దుష్పరిణామాలపై బాలికలకు అవగాహన కల్పించారు. డా. మల్లికార్జున యుక్తవయసు మార్పులపై, డా. సుధాకర్ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలపై సూపర్వైజర్ సరస్వతి సూచనలు చేశారు.