మద్దికెర మండలంలోని బసినేపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త లక్ష్మిదేవి (60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ స్థానికంగా అందరికీ పరిచితురాలయ్యారు. ఆమె మృతిపై జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, సర్పంచ్ మల్లికార్జున తదితర నాయకులు నివాళులర్పించారు. మృతదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.