చాగలమర్రి పట్టణంలో న్యూబిల్డింగ్స్ కాలనీలో నివాసముంటున్న మహేశ్వరి(30) అనే మహిళ నిప్పంటించుకుని సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త పవన్ చిరుతిళ్ల ప్యాకెట్ల వ్యాపారం చేస్తూ నష్టాలు రావడంతో అప్పులు చేయగా స్వగ్రామం చిన్నవంగలిలో రెండెకరాల పొలమును విక్రయించి కొంత మేర అప్పులు చెల్లించారు. నెలన్నర క్రితం ఆమె భర్త కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి మహేశ్వరి తన తండ్రి కృష్ణమూర్తితో కలిసి ఉంటున్నారు. అప్పుల ఒత్తిళ్లతో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల మృతితో పిల్లలు ఆనాధలు అయ్యారు.