పంటలు ఎండుతున్నాయి.. ఏబీసీ కెనాల్ కు నీరు వదలాలి

73చూసినవారు
పంటలు ఎండుతున్నాయి.. ఏబీసీ కెనాల్ కు నీరు వదలాలి
హంద్రీనీవా ప్రధాన కాలువకు తూము ఏర్పాటు చేసి ఏబీసీ కెనాల్ కు నీరు వదలాలని కర్నూలు సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తుంగభద్ర దిగువ కాలుక కింద ఉన్న ఏబీసీ కెనాల్ ద్వారా దాదాపు 14, 265 ఎకరాలకు సాగునీరు వ అందుతుందన్నారు. అయితే ప్రస్తుతం తుంగభద్ర నుంచి కేటాయించిన మేరకు నీరు రాకపోవడంతో రైతులు వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్