కర్నూలు జిల్లాలో టమాట ధర రోజు రోజకు తగ్గిపోతోంది. బుధవారం పత్తికొండ మార్కెట్ యార్డుకు 820 క్వింటాళ్ల టమాట పంట విక్రయానికి వచ్చింది. కిలో టమాట గరిష్టంగా రూ. 20. 10 పలికింది. కనిష్టంగా రూ. 10, మధ్య ధర రూ. 15 చొప్పున అమ్మకాలు జరిగాయి. రోజురోజుకూ జిల్లాలో టమాట ధరలు తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.