డోన్ పట్టణ సమీపంలో ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు కొత్తపల్లి వద్ద భారత్ డాబా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో డోన్ పట్టణానికి చెందిన ఒక యువకుడు స్పాట్‌లో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.