రాష్ట్రంలో ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టిందని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. బుధవారం పత్తికొండ మండలంలోని దూదేకొండలో రూ. 78 లక్షల ఇంటింటికీ కొళాయి పథకం, పత్తికొండ మార్కెట్‌యార్డు వెనుక సీసీ రహదారి, బృందావన్ కాలనీలో సీసీరోడ్, విజన్ 2047 కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.