పత్తికొండ మండలంలోని రైతులు ఈ నెల 15వ తేదీలోపు ఈ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వెంకట్ రాముడు పేర్కొన్నారు. గురువారం పత్తికొండ మండలంలోని చిన్నహుల్తి, జుటూరు, దేవనబండ, నలకదొడ్డిలోని రైతు సేవా కేంద్రాలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వారు మాట్లాడారు. ఈ పంట నమోదును త్వరతగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకు పంట నమోదు చేయించుకోవాలన్నారు.