ఉపాధి నిధులు రూ. 9. 09 కోట్లతో పశువుల షెడ్లు మంజూరు

52చూసినవారు
ఉపాధి నిధులు రూ. 9. 09 కోట్లతో పశువుల షెడ్లు మంజూరు
కర్నూలు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొదటి విడతలో 466 పశువుల షెడ్ల నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సోమవారం పరిపాలన అనుమతులు ఇచ్చారు. జిల్లాకు 1200 పశువుల షెడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ షెడ్లకు అర్హులైన రైతులను పశుసంవర్థక శాఖకు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఏరియా పశువైద్యశాలల ఏడీలు ఎంపిక చేసి ఉపాధి హామీకి చెందిన ఏపీఓలకు ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్