నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి గడువు పెంచినట్లు కర్నూలు జిల్లా డీఈవో శామ్యూల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 5వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తు ప్రక్రియ మొదట ఈనెల 06వ తేదీ వరకు ఉన్న గడువును 17వ తేదీ వరకు పెంచారన్నారు. ఈ గడువును మరోసారి ఈనెల 24వ తేదీ వరకు పెంచినట్లు తెలిపారు. డిసెంబరు 8న జరుగుతుందన్నారు. www. bse. ap. gov. in అనే వెబ్ సైట్ ను చూడాలన్నారు.