అప్పుల బాధతో ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

70చూసినవారు
అప్పుల బాధతో ఉరివేసుకొని రైతు ఆత్మహత్య
మద్దికెర మండల కేంద్రానికి చెందిన తుమ్మల మద్దిలేటి (34) అనే రైతు అప్పుల బాధలు తాళలేక శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మల మద్దిలేటి తన కున్న రెండున్నర ఎకరాలతో పాటు మరింత పొలాన్ని కౌలుకు చేసుకుంటున్నాడు. దాదాపు రూ. 20 లక్షలు అప్పులు చేశాడు. ఇందులో పొలాన్ని అమ్మి రూ. 14 లక్షల వరకు అప్పు తీర్చాడు. మిగిలిన అప్పులు తీర్చాలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్