ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నగేష్ యాదవ్ మండిపడ్డారు. గురువారం తుగ్గలి మండలం జీ. ఎర్రగుడిలో ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. బీసీలకు పింఛన్, మహిళలకు నెలకు రూ. 1500, రైతులకు రూ. 20వేలు వంటి హామీలు విస్మరించారని విమర్శించారు. ప్రజలతో కలిసి వైసీపీ ఆందోళనలకు సిద్ధమని తెలిపారు.