ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ నిధులను అప్పటి సీఎం జగన్ పక్కదారి పట్టించారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. బుధవారం పత్తికొండలో ఆయన మాట్లాడారు. జగన్ ఉద్దరిస్తారనీ పాలనను కట్టబెడితే, ఐదేళ్లలో ప్రజలకు నరకయాతన చూపారన్నారు. గత వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వర్గీకరణ అమలైతే ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్‌లో న్యాయం జరుగుతుందన్నారు.