పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, క్యాంప్ క్లర్క్‌పై వచ్చిన అక్రమ వసూళ్లు, వేధింపుల ఆరోపణలపై సోమవారం జేసీ బి. నవ్య విచారణకు ఆదేశించారు. 11న విచారణకు హాజరు కావాలని పత్తికొండ డివిజన్ వీఆర్వోల అసోసియేషన్ సభ్యులతో పాటు ప్రతి మండలం నుంచి ఇద్దరు వీఆర్వోలకు నోటీసులు జారీ చేశారు. గతనెల 20న కలెక్టర్ సహా సీసీఎల్ఎ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఈ చర్యలు తీసుకున్నారు. విచారణ విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.