జొన్నగిరి: పేకాట ఆడుతున్న 12 మంది అరెస్టు, కేసు నమోదు

141చూసినవారు
జొన్నగిరి: పేకాట ఆడుతున్న 12 మంది అరెస్టు, కేసు నమోదు
తుగ్గలి మండలం జొన్నగిరి స్టేషన్ పరిధిలో శనివారం పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకున్నారు. జొన్నగిరి ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం చెరువు కట్ట కింద కంపచెట్లలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి, అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5, 320 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్