తుగ్గలి మండలంలో జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మొహర్రం శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై మల్లికార్జున ప్రజలకు సూచించారు. శుక్రవారం బొల్లవానిపల్లి, ఉసేనాపురం వంటి గ్రామాల్లో పర్యటించిన ఆయన, గ్రామ ప్రజలు మరియు కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని కోరుతూ, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.