స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌లో కార్యక్రమంలో భాగంగా పత్తికొండ 11వ వార్డులో నిర్వహించిన శుభ్రత కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ పాల్గొన్నారు. ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించి పత్తికొండను రాష్ట్రంలో అత్యంత పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈవో నరసింహులు, సర్పంచ్ కొమ్ము దీపిక, స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.