కృష్ణగిరి మండలం పోతుగల్లులో బోయ రాముడు గతనెల 26న బహిర్భూమికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో భార్య బోయ రంగమ్మ శుక్రవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణమూర్తి చెప్పారు. రాముడు 15 ఏళ్లు క్రితం పెళ్లి అయిందని, కానీ పిల్లలు లేరన్నారు. అన్నకు బ్లడ్ క్యాన్సర్ రాక ఈ విషయంపై తీవ్రంగా బాధపడుతున్నాడని కుటుంబం తెలిపింది.