వెల్దుర్తిలో తప్పిపోయిన బాలుడు సురక్షితంగా అప్పగింత

75చూసినవారు
వెల్దుర్తిలో తప్పిపోయిన బాలుడు సురక్షితంగా అప్పగింత
వెల్దుర్తి 9వ వార్డు ముల్లగేరిలో మూడేళ్ల బాలుడు అభిరామ్ తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. శనివారం ఇంటి వద్ద ఆడుకుంటూ బంధువుతో పోలీసు స్టేషన్ సమీప దుకాణానికి వెళ్లిన అభిరామ్, యువకుడు వెళ్లిపోవడంతో ఒక్కడై డోన్ వైపు వెళ్లాడు. స్థానికులు బాలుడిని పోలీసులకు అప్పగించారు. ఎస్సై అశోక్ సూచనపై ఫోటోను వాట్సాప్‌లో ఉంచడంతో తల్లితండ్రులు గుర్తించి పోలీసు స్టేషన్‌కి చేరుకున్నారు. వారి బాలుడిని క్షేమంగా అప్పగించారు.

సంబంధిత పోస్ట్