పత్తికొండ: సెమిస్టర్ పరీక్షలకు 798 మంది గైర్హాజరు

50చూసినవారు
పత్తికొండ: సెమిస్టర్ పరీక్షలకు 798 మంది గైర్హాజరు
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన సెమిస్టర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 798 మంది గైర్హాజరయ్యారు. 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 8, 376 మంది దరఖాస్తు చేయగా 7, 632 మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేశారు. బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 589 మందిలో 535 మంది హాజరయ్యారని వర్సిటీ ఎగ్జామ్ కంట్రోలర్ డా. ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్