పత్తికొండ: ఏపీ మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు అవకాశం

54చూసినవారు
పత్తికొండ: ఏపీ మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు అవకాశం
పత్తికొండ పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ లో 7, 8, 9 తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విక్టర్ సామేల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన మార్గనిర్దేశాల మేరకు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ కమిషనర్ అవకాశం కల్పించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్