పత్తికొండ: ఆవుల దాడిలో చిన్నారికి గాయాలు

82చూసినవారు
పత్తికొండ: ఆవుల దాడిలో చిన్నారికి గాయాలు
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి పట్టణంలో ఆదివారం 7వ వార్డులో 5 ఏళ్ల సమీహ అనే చిన్నారి పై ఆవులు దాడి చేశాయి. స్థానికుల సమాచారం మేరకు ఇంటి ఎదుట ఆడుకుంటుండగా ఆవుల దాడికి గురై గాయపడింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పంచాయతీ ఈవో లక్ష్మీనాథ్ స్పందించినా ఫలితం లేకపోయింది. ఆవుల విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్