పత్తికొండ మండలం హోసూరులో జరిగే భద్రకాళి శ్రీవీరభద్రేశ్వర స్వామి తిరుణాలకు ముందు, ఆలయం వద్ద, రథోత్సవ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పత్తికొండ అర్బన్ సీఐ జయన్న సూచించారు. మంగళవారం ఆయన పత్తికొండలో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలను నిరోధించడమే కాకుండా, నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు సహకరిస్తాయని ఆయన తెలిపారు. గ్రామస్తులు, పెద్దలు ఈ ప్రతిపాదనకు సహకరించాలని కోరారు.