అటికెలగుండులో ఇరువర్గాల ఘర్షణ.. 10 మందిపై కేసు

62చూసినవారు
అటికెలగుండులో ఇరువర్గాల ఘర్షణ.. 10 మందిపై కేసు
పత్తికొండ మండలం పరిధిలోని అటికెలగుండులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని శనివారం సీఐ జయన్న తెలిపారు. గ్రామంలో రేషన్ కార్డులందరికీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు దండోరా వేస్తుండగా కొంతమంది దురుసుగా ప్రవర్తించారు. దీనితో మాటామాట పెరిగి రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఘర్షణకు పాల్పడిన 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయన్న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్