కోరం లేక తుగ్గలి సర్వసభ్య సమావేశం వాయిదా

69చూసినవారు
కోరం లేక తుగ్గలి సర్వసభ్య సమావేశం వాయిదా
కోరం లేకపోవడంతో తుగ్గలి మండల సర్వసభ్య సమావేశం మంగళవారం వాయిదా పడింది. ఇన్చార్జి ఎంపీపీ ఎర్రనాగప్ప అధ్యక్షతన సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, 14 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాలేదు. కేవలం ఉప్పర్లపల్లి, రామాపురం ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. గైర్హాజరు కారణంగా సర్వసభ్య సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేయాలని ఎంపీడీవో విశ్వమోహన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్