కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో శనివారం పీర్ల ఊరేగింపు సందర్భంగా కోడెం రామాంజనేయులు (42) అగ్నిగుండం వద్ద నృత్యం చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఇంటికి వెళ్లిన ఆయన ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులకు ఫోన్ చేశారు. వారు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.