పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నేపథ్యంలో, ఎంపీపీ నారాయణదాసు, సర్పంచ్ శ్రీరాములు, స్పెషల్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఎంపీడీవో కవిత సమన్వయంతో బుధవారం నీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయించారు. గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 150 అడుగుల లోతులో బోరు వేసినట్లు తెలిపారు. మండల, పంచాయతీ గ్రాంట్లతో పనులు పూర్తి చేయడంతో గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.