తుగ్గలి పట్టణంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో 93% మొదటి సంవత్సరం, 82% రెండవ సంవత్సరం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వి. షాహీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరం 30 మంది విద్యార్థినిలలో 28 మంది, రెండవ సంవత్సరం 28 మంది విద్యార్థినిలలో 23 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు.