రీ సర్వేతో ప్రతి రైతు భూమి ఎంత ఉందో సమగ్రంగా తెలుస్తుందని, భూ సమస్యలు పరిష్కారమవుతాయని తుగ్గలి తహసీల్దార్ రమాదేవి అన్నారు. గురువారం తుగ్గలి మండలం పగిడిరాయిలో రీసర్వేపై గ్రామ సభ నిర్వహించారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా భూములను రీసర్వే చేస్తామని తహసీల్దార్లు చెప్పారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. సర్పంచ్ జయశ్రీ ఎంపీటీసీ సభ్యురాలు రంగమ్మ, తదితరులు ఉన్నారు.