మద్దికెర మండలంలో రైతులు ఇబ్బందులు పడకుండా భూసర్వే పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ గురువారం తెలిపారు. ఏపీ రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెరవలిలో అవగాహన ర్యాలీ చేసి రైతులతో గ్రామసభ నిర్వహించి భూసర్వేపై అవగాహన కల్పించారు. రోజుకు కనీసం 20 ఎకరాలకు సర్వే చేస్తామన్నారు. ఆర్ఐ రవికుమార్, విఆర్వో బాలవర్ధిరాజు, ఈఓ సుధాకర్ పాల్గొన్నారు.