పత్తికొండ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

77చూసినవారు
పత్తికొండ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
కృష్ణగిరి మండలం తొగర్చేడుకి చెందిన కొంకి గిడ్డయ్య (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈనెల 4న బైకుపై తన భార్య గిడ్డమ్మతో కలిసి వరి పొలానికి వెళ్తున్న వారి బైక్ ను గొల్ల శివ బైక్ తో ఢీకొన్నాడు. గాయపడిన గిడ్డయ్య శుక్రవారం ఆసుపత్రిలో కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గొల్ల శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

సంబంధిత పోస్ట్