వెల్దుర్తి మండలంలోని ఎల్. నగరంలో వడ్డె శ్రీలేఖ (22) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె రసాయన మందు తాగింది. మూడేళ్ల క్రితం ఎల్లేశ్వరుడుతో వివాహం చేసుకున్న శ్రీలేఖకు 2 సంవత్సరాల కుమార్తె, 5 నెలల కుమారుడు ఉన్నారు. కుటుంబీకులు ఆమెను వెంటనే సీహెచ్సీకి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.