పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం కడమకుంట్లలో నాటుసారా విక్రయిస్తున్న రవీంద్రను ఎక్సైజ్ సీఐ
విశ్వేశ్వరరావు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనిఖీల్లో రవీంద్ర ఇంట్లో 5 లీటర్ల నాటుసారా పట్టుబడిందని ఎక్సైజ్ సీఐ విశ్వేశ్వరరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు మానుకోవాలని హెచ్చరించారు.