పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండలంలో ఈడిగ గౌడ్ కులాలకు కేటాయించిన వైన్ షాపు కోసం ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని శుక్రవారం ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి సుధీర్ బాబు తెలిపారు. పత్తికొండలో ఈడిగ కులస్థులతో సమావేశం నిర్వహించి, దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 8వ తేదీగా ఉన్నప్పటికి ఆన్‌లైన్‌లో అర్హులైన వారు దరఖాస్తు చేయాలని సూచించారు.