పత్తికొండ: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య

73చూసినవారు
పత్తికొండ: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య
భార్యభర్తల మధ్య మనస్పర్థలతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం తుగ్గలి మండలం జీ. ఎర్రగుడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ముకలపెంటకు చెందిన శివ(38)కు జీ. ఎర్రగుడికి చెందిన వరలక్ష్మితో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నారు. జీ. ఎర్రగుడి వచ్చి భార్యతో ఉంటున్న వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్