తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం చాలా బాధాకరమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం ఆయన పత్తికొండలో మాట్లాడారు. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం బాధాకరమని, బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇచ్చిందన్నారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆకాంక్షించారు.