కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జూటూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే శ్యాంబాబు కాడెద్దులు కట్టి దుక్కు దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో వర్షాలు కురిసి రైతుల పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. వేరుశనగ విత్తనాల పంపిణీ జరిగిందని, ఈ నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.