పత్తికొండ: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు

50చూసినవారు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆరోపించారు. మంగళవారం పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు 188 కేసులు నమోదయ్యాయి, 15 మంది మహిళలు, బాలికలు హత్యకు గురై, 9 మంది అనుమానాస్పదంగా మరణించారని విమర్శించారు. సామాజిక అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్