పత్తికొండ: కూతురు మృతి.. తల్లికి తీవ్ర గాయాలు

59చూసినవారు
పత్తికొండ: కూతురు మృతి.. తల్లికి తీవ్ర గాయాలు
పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ తల్లికి గర్భశోకం మిగిలింది. శనివారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో కుమార్తెను కోల్పోయి తీవ్ర గాయాలపాలైంది ఆ తల్లి. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన సుజాత ఇద్దరు పిల్లలతో రెడ్డిపాలెంకు ఇద్దరు పిల్లలతో వెళ్లింది. కాగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో కుమార్తె మమత (5) మృతి చెందగా, తల్లి సుజాతకు తీవ్ర గాయాలయ్యాయని ఆదివారం గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్