పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద 2025-26 సంవత్సరానికి ఆర్థిక సహాయానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో విశ్వమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. మండలంలోని జొన్నగిరికి 2, తుగ్గలికి 3, పెండేకల్లులోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు 3 యూనిట్లు మంజూరు కాగా, ఆసక్తిగల అభ్యర్థులు మే 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు.