ఎయిడ్స్ వ్యాధిని తరిమికొడదాం, ఎయిడ్స్ పై అవగాహన కల్పిద్దాం, ఎయిడ్స్ ను చూసి భయపడకు అంటూ నినాదాలు ఇస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పత్తికొండ మండలం పత్తికొండలో శనివారం ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీని ప్రారంభించి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్. ఎస్. ఎస్ యూనిట్ ఇన్ఛార్జ్ రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం జరిగింది.